Pawan Kalyan: విజయ్ టీవీకే పార్టీపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు... వీడియో వైరల్!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల ఓ తమిళ మీడియా ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా దళపతి విజయ్ టీవీకే పార్టీ ప్రస్తావన వచ్చింది. విజయ్ రాజకీయాల్లో దూకుడు పెంచారు... మీరు ఆయన పార్టీని గమనిస్తున్నారా? అని జనసేనానిని యాంకర్ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు పవన్ బదులిచ్చారు. "నేను ప్రత్యేకంగా దృష్టిసారించలేదు. విజయ్ పార్టీ గురించి వాళ్లు, వీళ్లు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఆయన అంటే నాకు చాలా గౌరవం. ఒకే ఒక్కసారి కలిశాం. రాజకీయాల్లో ప్రయాణం చాలా కఠినంగా ఉంటుంది. ఓపిక, సహనం ఉండాలి. ఆయనకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా" అని పవన్ చెప్పారు.
దీంతో ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. విజయ్ అభిమానులతో పాటు జనసైనికులు తెగ షేర్ చేస్తున్నారు.