Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ భవిష్యత్తుపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

- ఆ పార్టీ అధికారంలోకి రావడం కలేనని ఎద్దేవా
- ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్
- ఈ ఛాలెంజ్ కు కేటీఆర్ సిద్ధమేనా అంటూ ప్రశ్నించిన మంత్రి
తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పని అయిపోయిందని, మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి రావడం కల మాత్రమేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వందకు వంద శాతం మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం దక్కించుకోవడం ఇక కలేనని మంత్రి ఎద్దేవా చేశారు. ఒకవేళ తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు.
ఈ సవాలుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్ధమేనా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విదేశాల నుంచి వస్తే కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లక తప్పదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఐదు అమలు చేశామని.. మిగిలినవి కూడా అతి త్వరలో అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.