Nandamuri Balakrishna: మరింత ముందుకొచ్చిన ‘ఆదిత్య 369’ .. రీ రిలీజ్ డేట్ ఇదే!

Adithya 369 Re Release Date

  • 1991లో విడుదలైన 'ఆదిత్య 369'
  • ద్విపాత్రాభినయం చేసిన బాలయ్య
  • ఆయన కెరియర్లో ఈ సినిమా స్థానం ప్రత్యేకం  
  • ఏప్రిల్ 11న రీ రిలీజ్ చేయాలనుకున్న టీమ్ 
  • 4వ తేదీనే రీ రిలీజ్ చేస్తున్నట్టు తాజా ప్రకటన  



నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’ మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. 1991లో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన ఈ సినిమాను 4K డిజిటలైజేషన్, 5.1 సౌండ్‌తో మరింత అధునాతనంగా మళ్ళీ ప్రేక్షకులకు అందిస్తున్నారు.

శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ - “నందమూరి బాలకృష్ణ గారు శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణ కుమార్‌గా రెండు విభిన్న పాత్రల్లో అద్భుతంగా నటించారు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు ఈ సినిమాను తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా తీర్చిదిద్దారు. ఇప్పటి టెక్నికల్ హంగులతో మరింత గొప్ప అనుభూతిని అందించేలా రీ రిలీజ్‌కి సిద్ధమైంది. మంచి థియేటర్లు లభించడంతో, ముందుగా అనుకున్న ఏప్రిల్ 11న కాకుండా ఏప్రిల్ 4వ తేదీనే రీ రిలీజ్ చేయాలని నిర్ణయించాం’’ అన్నారు.

Nandamuri Balakrishna
Aditya 369
Re-release
Telugu Cinema
Classic Film
Science Fiction
Singitam Srinivasa Rao
4K Digitalization
April 4th Release
Sridevi Movies
  • Loading...

More Telugu News