Anchor Shyamala: బెట్టింగ్ యాప్ కేసు.. విచార‌ణ‌కు హాజ‌రైన యాంక‌ర్ శ్యామ‌ల‌

Anchor Shyamala Appears for Betting App Case Inquiry

  • పంజాగుట్ట పోలీసుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌రైన శ్యామ‌ల‌
  • హైకోర్టు సూచ‌న మేరకు పోలీసుల విచార‌ణ‌కు యాంక‌ర్‌
  • ఇదే కేసులో ఇప్ప‌టికే విష్ణు ప్రియ, రీతూచౌద‌రిల‌ను విచారించిన పోలీసులు

బెట్టింగ్ యాప్‌లు ప్ర‌మోట్ చేసిన కేసులో యాంక‌ర్ శ్యామ‌ల కొద్దిసేపటి క్రితం పంజాగుట్ట పోలీసుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. త‌నపై న‌మోదైన కేసును కొట్టివేయాలంటూ ఆమె తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిష‌న్ వేసిన విష‌యం తెలిసిందే. దాంతో న్యాయ‌స్థానం శ్యామ‌ల‌ను అరెస్టు చేయొద్ద‌ని పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేసింది. అలాగే విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల్సిందిగా ఆమెకు సూచించింది. 

ఇందులో భాగంగానే శ్యామ‌ల ఈరోజు ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లారు. ఇక ఇదే కేసులో ఇప్ప‌టికే మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర్ రీతూచౌద‌రి, టీవీ యాంక‌ర్ విష్ణుప్రియ‌లు సైతం పంజాగుట్ట పోలీసుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌రైన విష‌యం విదిత‌మే.    

  • Loading...

More Telugu News