Rohit Sharma: ఐపీఎల్‌లో అత్యధికంగా డకౌట్ అయ్యింది ఎవరో తెలుసా?

- మరోసారి డకౌట్ అయిన రోహిత్ శర్మ
- చెత్త రికార్డులో గ్లెస్ మాక్స్‌వెల్ సరసన రోహిత్
- ఐపీఎల్‌లో 18 సార్లు డకౌట్ అయిన గ్లెస్ మాక్స్ వెల్, దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మ
ప్రస్తుతం ఐపీఎల్ సందడి కొనసాగుతున్న విషయం విదితమే. నిన్న చెన్నైలోని ఎం.ఎ. చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య రెండో మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బౌలింగ్ ఎంచుకోగా, ముంబై ఇండియన్స్ జట్టు తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే, ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ (0) డకౌట్ అయ్యాడు.
నాలుగు బంతులు ఆడిన రోహిత్ శర్మ, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఐపీఎల్ మ్యాచ్‌లలో అత్యధిక సార్లు డకౌట్లు అయిన గ్లెన్ మాక్స్‌వెల్ సరసన రోహిత్ శర్మ చేరాడు. గ్లెన్ మాక్స్‌వెల్ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 18 సార్లు డకౌట్ అయ్యాడు.
తాజాగా రోహిత్ శర్మ కూడా 18 సార్లు పరుగులేమీ చేయకుండానే డకౌట్ అయ్యాడు. వీరితో పాటు దినేష్ కార్తీక్ కూడా 18 సార్లు డకౌట్ అయిన వారి జాబితాలో ఉన్నాడు. వీరి తర్వాత పియూష్ చావ్లా, సునీల్ నరైన్ 16 డకౌట్లతో కొనసాగుతున్నారు.