YS Jagan: నేడు పులివెందులలో జగన్ పర్యటన

- వడగళ్ల వానతో పులివెందులలో దెబ్బతిన్న వేలాది ఎకరాల అరటి తోటలు
- లింగాల మండలంలో దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించనున్న వైఎస్ జగన్
- వేంపల్లిలో జెడ్‌పీటీసీ రవి నివాసంలో జరిగే శుభకార్యానికి హాజరవ్వనున్న వైఎస్ జగన్
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ రోజు పులివెందులలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వడగళ్ల వానతో దెబ్బతిన్న అరటి తోటలను జగన్ పరిశీలించనున్నారు. నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించనున్నారు.
ఉదయం 8.30 గంటలకు పులివెందులలోని నివాసం నుంచి బయలుదేరి లింగాల మండలానికి జగన్ చేరుకుంటారు. లింగాల మండలంలో వడగళ్ల వాన కారణంగా వేలాది ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న అరటి తోటలను జగన్ పరిశీలించిన అనంతరం అరటి రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు.
తదుపరి, వేంపల్లిలో జెడ్‌పీటీసీ రవి నివాసంలో జరిగే శుభకార్యానికి జగన్ హాజరవుతారు. అనంతరం అక్కడి నుంచి ఇడుపులపాయ చేరుకుని, అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.
కాగా, పులివెందులలో ప్రముఖ పారిశ్రామికవేత్త చవ్వా విజయభాస్కర్ రెడ్డి మృతి చెందడంతో నిన్న సాయంత్రం ఆయన భౌతిక కాయానికి జగన్ నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.