Nithin: నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ రిలీజ్... లాలిపాప్ తింటూ హెలికాప్టర్ దిగిన వార్నర్

- నితిన్, శ్రీలీల జంటగా రాబిన్ హుడ్
- మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వెంకీ కుడుముల దర్శకత్వంలో చిత్రం
- నేడు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్
- మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వస్తున్న రాబిన్ హుడ్
టాలీవుడ్ హీరో నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం రాబిన్ హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిసున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాదులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ హాజరు కావడం విశేషం.
రాబిన్ హుడ్ చిత్రంలో ఓ పాత్ర కూడా పోషించిన డేవిడ్ వార్నర్... నేటి ప్రీ రిలీజ్ వేడుకలో అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశాడు. అంతేకాదు, నితిన్, శ్రీలీల, కేతికా శర్మలతో కలిసి వేదికపై అదిదా సర్ ప్రైజు సాంగ్ కి డ్యాన్స్ కూడా చేశాడు. నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన వార్నర్... తనకు అవకాశం ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుముల, హీరో నితిన్, నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పాడు. ట్రైలర్ రిలీజ్ చేసిన సందర్భంగా పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ లా నడిచి చూపించాడు.
కాగా, రాబిన్ హుడ్ ట్రైలర్ లో వార్నర్ కూడా ఉన్నాడు. వార్నర్ లాలిపాప్ తింటూ హెలికాప్టర్ లో దిగడం చూపించారు. మొత్తమ్మీద ఈ సినిమా యాక్షన్ ఎంటర్టయినర్ అని అర్థమవుతోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు. రాబిన్ హుడ్ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.