KTR: కరీంనగర్ లో కేటీఆర్ కాన్వాయ్ లో అపశృతి

Accident in KTRs Convoy During Karimnagar Visit

  • నేడు కరీంనగర్ పర్యటనలో ఉన్న కేటీఆర్
  • కానిస్టేబుల్ పద్మజను ఢీకొన్న బీఆర్ఎస్ కార్యకర్త శ్రీకాంత్ బైక్
  • పద్మజను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన పార్టీ శ్రేణులు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు కరీంనగర్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన కాన్వాయ్‌లో అపశృతి చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ పద్మజను పార్టీ కార్యకర్త శ్రీకాంత్ బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె కాలు విరిగింది. వెంటనే పార్టీ శ్రేణులు ఆమెను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేటీఆర్ ఆరా తీశారు. పద్మజకు వెంటనే మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆసుపత్రి వైద్యులను కోరారు.

  • Loading...

More Telugu News