: రామ్ దిన్ పై రెండు మ్యాచ్ ల నిషేదం
విండీస్ వికెట్ కీపర్ దినేష్ రామ్ దిన్ పై ఐసీసీ రెండు మ్యాచ్ ల నిషేధం విధించింది. శుక్రవారం పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో రామ్ దిన్, మిస్బా క్యాచ్ వదిలేసినప్పటికీ అవుటంటూ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా అప్పీలు చేయడంతో మ్యాచ్ రిఫరీ క్రిస్ బోర్డ్ విచారణకు ఆదేశించారు. రామ్ దిన్ రేపు భారత్ తో పాటు జరుగనున్న మ్యాచ్ తోపాటు, జూన్ 14 న జరుగనున్న దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కు కూడా దూరం కానున్నాడు. దీంతో మ్యాచ్ ఫీజులో నూరు శాతం కోతతో పాటు, ఈ రెండు మ్యాచ్ లలో నిషేధం ఎదుర్కోనున్నాడు.