Somu Veeraju: జగన్, కేసీఆర్ పై సోము వీర్రాజు విమర్శలు

Somu Veeraju Slams Jagan and KCR

  • జగన్ మళ్లీ సీఎం అవుతానని కలలు కంటున్నారన్న వీర్రాజు
  • వైసీపీకి 20 శాతం ఓట్లు కూడా రాకుండా చూస్తామని వ్యాఖ్య
  • కేసీఆర్ రాత్రిపూట నిద్రపోవడం లేదన్న వీర్రాజు

వైసీపీ అధినేత జగన్ పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని జగన్ కలలు కంటున్నారని... వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 20 శాతం ఓట్లు కూడా రాకుండా చూస్తామని చెప్పారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళతానని జగన్ చెబుతుండటం విడ్డూరంగా ఉందని అన్నారు. 

2014లో జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినప్పటికీ అసెంబ్లీకి వెళ్లలేదని సోము వీర్రాజు గుర్తు చేశారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే సభకు వస్తానని అంటున్నారని... జగన్ ది రెండు నాల్కల ధోరణి అని విమర్శించారు. వైసీపీని ఖాళీ చేయించడమే కూటమి లక్ష్యమని చెప్పారు. 

ఇదే సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కూడా వీర్రాజు విమర్శలు గుప్పించారు. కేసీఆర్ తన కుమార్తె కవిత, కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీశ్ రావు గురించి ఆలోచిస్తున్నారని... ఆయన రాత్రిపూట నిద్రపోవడం లేదని అన్నారు. తెలంగాణ ప్రజలకు కల్లిబొల్లి మాటలు చెప్పి పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించారని విమర్శించారు.

Somu Veeraju
Jagan Mohan Reddy
KCR
YSR Congress Party
BJP
BRS
Andhra Pradesh Politics
Telangana Politics
Indian Politics
Assembly Elections
  • Loading...

More Telugu News