Sunrisers Hyderabad: సన్ రైజర్స్ × రాజస్థాన్... టాస్ పడింది!

- ఐపీఎల్ లో నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఢీ
- ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
- హైదరాబాద్ కు ఫస్ట్ బ్యాటింగ్
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 18వ సీజన్ లో నేడు తన తొలి మ్యాచ్ ను ఆడుతోంది. రాజస్థాన్ రాయల్స్ ప్రత్యర్థిగా ఉంది. సొంతగడ్డ ఉప్పల్ స్టేడియంలో ఆడుతుండడం సన్ రైజర్స్ కు కలిసొచ్చే అంశం. టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడినప్పటికీ హైదరాబాద్ కు బ్యాటింగ్ దక్కడంతో స్టేడియంలో ఉన్న ఆరెంజ్ ఆర్మీ అరుపులు, కేకలతో హోరెత్తించింది.
కాగా, ఈ మ్యాచ్ ద్వారా ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరఫున తొలిసారిగా బరిలో దిగనున్నారు. కాగా, రెగ్యులర్ కెప్టెన్ సంజు శాంసన్ గాయంతో బాధపడుతుండడంతో ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కు రియాన్ పరాగ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్
పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, సమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ.
రాజస్థాన్ రాయల్స్
రియాన్ పరాగ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీశ్ రాణా, షిమ్రోన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్) జోఫ్రా ఆర్చర్, మహీశ్ తీక్షణ, తుషార్ దేశ్ పాండే, సందీప్ శర్మ, ఫజల్ హక్ ఫరూఖీ.