Balakrishna: బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ పై ఫిర్యాదు

- తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కలకలం
- ఇప్పటికే పలువురు సినీ తారలపై కేసు
- బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ పై రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు
- ఫన్88 బెట్టింగ్ యాప్ కు ప్రచారం చేశారంటూ ఆరోపణ
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంల టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. తాజాగా అగ్రహీరోలు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ పైనా ఫిర్యాదు చేసారు. వీరు బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేశారంటూ హైదరాబాద్ పోలీసులకు ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు అందింది.
రామారావు అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు. ఫన్88 అనే బెట్టింగ్ యాప్ కు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ ప్రచారం చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పెద్ద హీరోలు ప్రమోటింగ్ చేయడం వల్ల చాలామంది ఈ బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టి పెద్ద ఎత్తున నష్టపోయారని రామారావు వివరించారు.
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతలపై ఇప్పటికే కేసులు నమోదవడం తెలిసిందే. పలువురు యాంకర్లు, యూట్యూబర్లు కూడా కేసులు ఎదుర్కొంటున్నారు.