Rohit Sharma: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బౌలింగ్.. హ్యాట్రిక్ వికెట్స్ తీసిన వీడియో ఇదిగో!

––
టీమిండియా సారథి రోహిత్ శర్మ బ్యాట్ తో విరుచుకుపడడం అందరికీ తెలిసిందే.. అయితే, బౌలింగ్ లోనూ ఈ హిట్ మ్యాన్ సత్తా చాటాడు. 2009లో దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ఐపీఎల్ మ్యాచ్ లో రోహిత్ శర్మ బౌలింగ్ చేశాడు. అప్పట్లో డక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన రోహిత్ ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో హ్యాట్రిక్ సాధించాడు. వరుసగా ముంబై ఇండియన్స్ బ్యాట్స్ మెన్లు అభిషేక్ నాయర్, హర్భజన్ సింగ్, జేపీ డుమినీలను పెవిలియన్ కు పంపించాడు.