Vidala Rajini: ఏసీబీ కేసుపై విడదల రజిని ఏమన్నారంటే..?

––
విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరింపులకు గురిచేసి వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు తనపై నమోదు చేసిన కేసుపై మాజీ మంత్రి విడదల రజిని స్పందించారు. కూటమి ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ప్రాథమిక ఆధారాలు కూడా లేకున్నా కేసులు బనాయిస్తోందని ఆమె ఆరోపించారు. బీసీ మహిళ అయిన తాను రాజకీయంగా ఎదుగుతుండటాన్ని ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదని, న్యాయపోరాటం చేస్తాని విడదల రజిని చెప్పుకొచ్చారు. కాగా, 2022 సెప్టెంబర్ నెలలో పల్నాడు జిల్లా యడ్లపాడులోని లక్ష్మీబాలజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరింపులకు గురిచేసి రూ.2.20 కోట్లు వసూలు చేసినట్లు విడదల రజనిపై ఏసీబీ కేసు నమోదైంది.