Manchu Vishnu: వేరే అమ్మాయిని వెతుక్కోమని నా భార్య చెప్పింది: మంచు విష్ణు

- తనకు పిల్లలంటే చాలా ఇష్టమన్న విష్ణు
- ఇంకా పిల్లలు కావాలని తన భార్యను అడిగానని వెల్లడి
- ప్రస్తుతం 'కన్నప్ప' సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న విష్ణు
సినీ నటుడు మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఏప్రిల్ 25న ఈ సినిమా విడుదల కాబోతోంది. మోహన్ బాబు, ప్రభాస్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను మంచు విష్ణు మొదలు పెట్టారు.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుటుంబ నియంత్రణకు సంబంధించిన ప్రశ్న ఆయనకు ఎదురైంది. చిన్నపిల్లలంటే తనకు చాలా ఇష్టమని... ఇప్పటికే నలుగులు పిల్లలు ఉన్నారని తెలిపారు. ఇంకా పిల్లలు కావాలని తన భార్య విరానికను అడిగానని... అలాగైతే వేరే అమ్మాయిని వెతుక్కోమని ఆమె చెప్పిందని అన్నారు. మంచి విష్ణు, విరానికలకు అరియానా, వివియానా, ఐరా అనే కూతుళ్లు, అవ్రమ్ అనే కుమారుడు ఉన్నారు.