Allu Arjun: అబుదాబిలోని స్వామి నారాయణ్ మందిర్‌ను సందర్శించిన బన్నీ.. ఇదిగో వీడియో

'పుష్ప-2: ది రూల్' సినిమాతో బంపర్ హిట్ కొట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్... ప్రస్తుతం తన తర్వాతి ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉన్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో బన్నీ తన తర్వాతి మూవీ చేయనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం కథ చర్చల కోసం ఆయన దుబాయ్ వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో అల్లు అర్జున్ అబుదాబిలోని స్వామి నారాయణ్ మందిర్‌ను సందర్శించారు.
ఆలయ నిర్మాణాలను ఆసక్తిగా తిలకించిన ఆయన... నారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రతినిధులు బన్నీకి మందిర్ విశిష్టతను, ప్రాముఖ్యతను వివరించారు. కాగా, అట్లీ-అల్లు అర్జున్ కాంబినేషన్‌లోని మూవీ షూటింగ్ మేలో ప్రారంభం కానుందని సమాచారం.