Gangul Kamalakar: దక్షిణాది రాష్ట్రాల ప్రత్యేక దేశం డిమాండ్ కచ్చితంగా వస్తుంది: గంగుల కమాలాకర్

South Indian speacial country demand will come says Gangula Kamalakar

  • డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న గంగుల
  • దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తే తిరుగుబాటు వస్తుందని వ్యాఖ్య
  • బీజేపీపై డీలిమిటేషన్, బీసీ రిజర్వేషన్ల కత్తులు వేలాడుతున్నాయన్న గంగుల

డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం దక్షిణాది రాష్ట్రాలను కుదిపేస్తోంది. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజన చేస్తే లోక్ సభలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గిపోతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణాదికి చెందిన రాష్ట్రాలు డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నాయి. 

తాజాగా ఈ అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తే... దక్షిణాది ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ కచ్చితంగా వస్తుందని అన్నారు. దక్షిణాదిన తిరుగుబాటు వస్తుందని చెప్పారు. బీజేపీపై డీలిమిటేషన్, బీసీ రిజర్వేషన్ల కత్తులు వేలాడుతున్నాయని... వాటిని సమర్థవంతంగా చేయకపోతే బీజేపీకి ఇబ్బందులు తప్పవని అన్నారు.

  • Loading...

More Telugu News