KTR: ఇందిరమ్మ రాజ్యంలో రైతుల గుండెల్లో గునపం.. కేటీఆర్ ట్వీట్

KTR Accuses Congress of False Promises on Farmer Welfare

  • నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం తీరు
  • అధికారం కోసం అక్షరాలా 420 అబద్దపు హామీలిచ్చిందని విమర్శ
  • మిస్టర్ రాహుల్ గాంధీ.. తెలంగాణసే మాఫీ మాంగో అంటూ ఫైర్

తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చామని కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు.. కానీ ఇదే ఇందిరమ్మ రాజ్యం రైతుల గుండెల్లో గునపం దింపిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి రావడం కోసం అక్షరాలా 420 అబద్ధపు హామీలిచ్చారని మండిపడ్డారు. ఈమేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. రుణమాఫీ, రైతుభరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అసెంబ్లీలో చేసిన ప్రకటనపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. నాడు రూ. 2 లక్షలు దాటినా రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడేమో రూ.2 లక్షలు దాటితే మాఫీ లేదంటున్నారని ఆరోపించారు. అబద్ధపు హామీలు ఇచ్చినందుకు ‘మిస్టర్ రాహుల్ గాంధీ, మాఫీమాంగో తెలంగాణసే’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

అధికారం కోసం అందరికీ రుణమాఫీ అని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు, అధికారంలోకి వచ్చాక కొందరికే రుణమాఫీ అని మాట మార్చారని కేటీఆర్ విమర్శించారు. చట్టసభల సాక్షిగా వరంగల్ డిక్లరేషన్‌ కు కాంగ్రెస్ తూట్లు పొడిచిందని అన్నారు. ‘నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు.. పెట్టెలో ఓట్లు పడ్డాయ్, జేబులో నోట్లు పడ్డాయ్.. ఢిల్లీకి మూటలు ముట్టాయ్ ఇక ఇచ్చిన వాగ్దానాలు ఉంటే ఎంత గంగలో కలిస్తే ఎంత అన్నట్లుంది కాంగ్రెస్ యవ్వారం’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

More Telugu News