Sunil Narine: ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌లో న‌రైన్ 'హిట్ వికెట్' వివాదం... ఎందుకు ఔట్ ఇవ్వ‌లేదంటే..?

IPL 2024 Opening Match Sunil Narines Hit Wicket Controversy

  • ఈడెన్ గార్డెన్స్‌లో ఐపీఎల్ 18వ సీజ‌న్ ఓపెనింగ్ మ్యాచ్ 
  • కేకేఆర్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి బోణీ కొట్టిన‌ ఆర్‌సీబీ
  • ఈ మ్యాచ్‌లో కోల్‌క‌తా బ్యాట‌ర్ న‌రైన్ హిట్ వికెట్ వివాదాస్ప‌దం
  • అత‌డ్ని ఎందుకు ఔట్ ఇవ్వ‌లేదంటూ నెట్టింట తెగ చ‌ర్చ‌
  • ఎంసీసీ నిబంధ‌న‌లే అందుకు కార‌ణం

కోల్‌క‌తాలోని ప్ర‌ఖ్యాత‌ ఈడెన్ గార్డెన్స్‌లో ఐపీఎల్ 18వ సీజ‌న్ ఓపెనింగ్ మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌), రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) త‌ల‌ప‌డ్డాయి. ఇందులో ఆర్‌సీబీ బోణీ కొట్టింది. ఏడు వికెట్ల తేడాతో కేకేఆర్‌ను ఓడించింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 174 ప‌రుగులు చేసింది. 175 ప‌రుగుల‌ టార్గెట్‌ను బెంగ‌ళూరు కేవ‌లం 16.2 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. 

అయితే, ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాట‌ర్ సునీల్ న‌రైన్ హిట్ వికెట్ వివాదాస్ప‌దంగా మారింది. దీనిపై నెట్టింట తెగ చ‌ర్చ జ‌రుగుతోంది. అస‌లు న‌రైన్‌ను ఎందుకు ఔట్ ఇవ్వ‌లేద‌ని అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. కాగా, ఎంసీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం బ్యాట‌ర్ బంతిని ఆడేట‌ప్పుడు లేదా ప‌రుగులు తీసే క్ర‌మంలో బ్యాట్ వికెట్ల‌ను తాకితేనే హిట్ వికెట్‌గా ప‌రిగ‌ణిస్తారు. 

అయితే, నిన్న బంతి న‌రైన్ పైనుంచి వెళ్లి కీప‌ర్ చేతిలో ప‌డ్డ త‌ర్వాత బ్యాట్ వికెట్ల‌ను తాకింది. అప్ప‌టికే అంపైర్ బంతిని వైడ్‌బాల్‌గా ప్ర‌క‌టించారు. అందుకే దాన్ని న‌రైన్‌ను నాటౌట్‌గా ప్ర‌క‌టించారు. ఈ మ్యాచ్‌లో న‌రైన్ బ్యాట్ ఝుళిపించిన విష‌యం తెలిసిందే. ఈ వెస్టిండీస్ స్టార్ 26 బంతుల్లోనే 44 పరుగులు చేశాడు.  

More Telugu News