Explosion: చెత్త ఎత్తుతుండగా పేలుడు, కుషాయిగూడలో కార్మికుడు మృతి.. వీడియో ఇదిగో!

––
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని కుషాయిగూడ పారిశ్రామిక వాడలో విషాదం చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం చెత్త కుప్పలో పేలుడు సంభవించింది. ఓ కార్మికుడు ట్రాక్టర్ లోకి చెత్త ఎత్తుతుండగా అకస్మాత్తుగా పేలుడు జరిగింది. ఈ ఘటనలో సాడక్ నాగరాజు అనే కార్మికుడు అక్కడికక్కడే చనిపోయాడు. రోడ్డు పక్కనే చోటుచేసుకున్న ఈ ఘటనతో పాదాచారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. నాగరాజు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక దర్యాఫ్తులో పేలుడుకు కారణం కెమికల్స్ అని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఈ కెమికల్స్ అక్కడికి ఎలా వచ్చాయి, ఎవరు వేశారనే కోణంలో దర్యాఫ్తు జరుపుతున్నట్లు వివరించారు. కాగా, ఘటనా స్థలానికి సమీపంలోని ఓ సీసీటీవీ కెమెరాలో ఈ పేలుడుకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.