David Warner: 'రాబిన్ హుడ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం విచ్చేసిన డేవిడ్ వార్నర్.. గ్రాండ్‌గా వెల్‌కం చెప్పిన మేకర్స్!

- నితిన్, వెంకీ కుడుముల కాంబోలో 'రాబిన్ హుడ్'
- ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ
- ఈరోజు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్
- ఈ మెగా ఈవెంట్‌కు ప్రత్యేక అతిథిగా డేవిడ్ వార్నర్
- దీనికోసం ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్‌కు విచ్చేసిన మాజీ క్రికెటర్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం 'రాబిన్ హుడ్'. నితిన్ సరసన కథానాయికగా యంగ్ బ్యూటీ శ్రీ లీల నటిస్తోంది. ఈ నెల 28న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది. ఇదే ఈవెంట్‌లో మూవీ ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నారు.
ఈ మెగా ఈవెంట్‌కు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. దీనికోసం ఆయన ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్‌కు విచ్చేశారు. దాంతో విమానాశ్రయంలో ఆయనకు అభిమానులతో కలిసి దర్శకుడు వెంకీ కుడుముల గ్రాండ్ వెల్‌కం చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా షేర్ చేసింది.
కాగా, ఈ చిత్రంలో వార్నర్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఇక ఆయన ఐపీఎల్‌లో చాలా కాలం పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. దాంతో వార్నర్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అప్పుడప్పుడు తెలుగు హీరోల పాటలకు డ్యాన్స్ చేస్తూ రీల్స్ కూడా చేశారు. అలాగే ప్రముఖ దర్శకుడు రాజమౌళితో కలిసి ఓ యాడ్‌లో కూడా వార్నర్ నటించిన విషయం తెలిసిందే.