Amazon: డిస్కౌంట్లకు ప్రాసెసింగ్ ఫీజు తీసుకువచ్చిన అమెజాన్!

Amazon Introduces Processing Fee on Discounts

  • ప్లిప్‌కార్టు బాటలో అమెజాన్
  • డిస్కౌంట్ ఆర్డర్లపై ప్రొసెసింగ్ ఫీజు వసూలు మొదలుపెట్టిన అమెజాన్
  • రూ.500 దాటిన ప్రతి ఆర్డర్‌పై రూ.49లు చొప్పున వసూలు

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సరికొత్త రుసుము వసూళ్లను ప్రారంభించింది. వినియోగదారులు డిస్కౌంట్లపై ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు, దానిపై రూ.49 చొప్పున ప్రాసెసింగ్ ఫీజును విధిస్తోంది. అయితే, తక్షణ డిస్కౌంట్ రూ.500లు దాటినప్పుడు మాత్రమే ఈ మొత్తం వసూలు చేస్తోంది. వినియోగదారులు కొనుగోలు చేసిన వస్తువుల విలువ అంతకంటే తక్కువగా ఉన్న సందర్భాల్లో ఈ ఫీజు నుండి మినహాయింపు ఉంటుంది.

మరో ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇదివరకే ఈ తరహా రుసుమును వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అమెజాన్ కూడా డిస్కౌంట్ ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేయడం ప్రారంభించింది. ఉదాహరణకు, మీరు రూ.5 వేల విలువైన వస్తువును కొనుగోలు చేస్తే, మీ బ్యాంకు మీకు రూ.500 తగ్గింపును అందిస్తుంది. సాధారణంగా మీరు రూ.4,500 చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు అమెజాన్ డిస్కౌంట్ ప్రాసెసింగ్ రుసుముగా రూ.49 వసూలు చేస్తుంది కాబట్టి, మీరు రూ.4,549 చెల్లించవలసి ఉంటుంది.

బ్యాంకు ఆఫర్ల నిర్వహణ, ప్రాసెసింగ్ ఖర్చును భరించడానికి ఈ రుసుము ఉపయోగపడుతుందని అమెజాన్ తెలిపింది. 

  • Loading...

More Telugu News