Bhilwara: బతికుండగానే శవయాత్ర.. అక్కడ అదో ఆచారం.. వీడియో ఇదిగో!

Witness the Unique Dol Ceremony of Rajasthan

  • రాజస్థాన్‌లోని భిల్వాడాలో ఘటన
  • 427 ఏళ్లుగా వస్తున్న ఆచారం
  • ఈ వేడుకలో పాల్గొనకుండా మహిళలపై నిషేధం

అక్కడ బతికి ఉండగానే పాడెపై పడుకోబెట్టి ఊరేగింపు నిర్వహిస్తారు. రంగులు చల్లుకుంటూ, డప్పు చప్పుళ్లతో అంతిమయాత్రను ఘనంగా నిర్వహిస్తారు. ఇదెక్కడి ఆచారం అని ఆశ్చర్యంగా ఉందా? ఈ విచిత్ర ఆచారం రాజస్థాన్‌లోని భిల్వాడాలో శతాబ్దాలుగా కొనసాగుతోంది. హోలీ పండుగ ముగిసిన వారం రోజులకు ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. బతికున్న వ్యక్తిని పాడెపై పడుకోబెట్టి శవయాత్ర నిర్వహిస్తారు. డోల్ అని పిలిచే ఈ ఊరేగింపు చిత్తోర్‌గఢ్ భవనం నుంచి ప్రారంభమై ఊరంతా తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. 

పాడెపై ఉన్న వ్యక్తి మధ్యలోనే లేచి కూర్చోవడం, నీళ్లు తాగడం వంటివి చేస్తుంటాడు. గుడి వద్దకు రాగానే అతడు పాడెపై నుంచి ఒక్కసారిగా దూకి పారిపోతాడు. తర్వాత ఆ పాడెను ఆలయం వెనుక దహనం చేస్తారు. ఊరేగింపులో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తారు. ఈ వేడుకలో మహిళలు పాల్గొనడం నిషేధం. ముందు రోజు మాత్రం భిల్వాడలోని ప్రతి ఇంట్లో ప్రత్యేక వంటకాలు తయారు చేస్తారు. అలాగే, ఆ రాత్రి నాటక ప్రదర్శన ఉంటుంది. ఇందులో కులాన్ని దూషించి అవహేళన చేస్తారు. అయితే, దీనిని ఎవరూ చెడుగా చూడరు. ఈ శవయాత్రను చూసేందుకు పలు ప్రాంతాల నుంచి భిల్వాడాకు జనం వస్తారు. 427 ఏళ్లుగా ఇక్కడ ఈ సంప్రదాయం కొనసాగుతున్నట్టు స్థానికులు తెలిపారు.

More Telugu News