Virat Kohli: ఐపీఎల్: 175 పరుగుల టార్గెట్ ను ఊదేసిన ఆర్సీబీ

RCB Thrash KKR in IPL Opener

  • నేటి నుంచి ఐపీఎల్ 
  • తొలి మ్యాచ్ లో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ
  • 7 వికెట్ల తేడాతో గెలిచిన బెంగళూరు
  • జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన కోహ్లీ

ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలుపు బోణీ కొట్టింది. డిఫెండింగ్ చాంప్ కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం అందుకుంది. 

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 174 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే 56, సునీల్ నరైన్ 44, రఘువంశీ 30 పరుగులు చేశారు. కృనాల్ పాండ్యా 3, హేజిల్వుడ్ 2 వికెట్లు తీశారు. 

అనంతరం 175 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు జట్టు 16.2 ఓవర్లలో కేవలం 3 వికెట్లకు ఛేదించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 56 పరుగులు చేసి అవుట్ కాగా... స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ 59 పరుగులతో అజేయంగా నిలిచి బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆర్సీబీ కొత్త కెప్టెన్ రజత్ పటీదార్ 16 బంతుల్లో 34 పరుగులు చేశాడు. చివర్లో లియామ్ లివింగ్ స్టన్ వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి మ్యాచ్ ముగించాడు.

Virat Kohli
RCB
IPL 2024
KKR
Royal Challengers Bangalore
Kolkata Knight Riders
Phil Salt
Rajat Patidar
Liam Livingstone
Ajinkya Rahane
  • Loading...

More Telugu News