Father: అచ్చం 'పరుగు' సినిమాలో చూపించినట్టే... ప్రియుడితో వెళుతున్న కూతురిని ఆపేందుకు తండ్రి ప్రయత్నం!

అల్లు అర్జున్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో 2008లో వచ్చిన 'పరుగు' చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిన కూతురి కోసం ఓ తండ్రి సాగించిన అన్వేషణ ఈ సినిమాలో చూడొచ్చు. కూతురు కనిపించిన తర్వాత ఇంటికి వచ్చేయయ్మా అని అడిగితే, ఆ కూతురు చెప్పిన సమాధానంతో ఆ తండ్రి దిగ్భ్రాంతికి గురవుతాడు. అది సినిమాలో!
కానీ అచ్చం అలాంటి సీనే రియల్ లైఫ్ లో జరిగింది. తమిళనాడులో జరిగిందీ ఘటన. ప్రేమించిన యువకుడితో వెళ్లిపోతున్న కూతురిని ఆపేందుకు ఆ తండ్రి కాళ్లావేళ్లాపడ్డాడు. అయినా, ఆ అమ్మాయి ప్రియుడితో వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.