Niranjan: మార్కాపురంలో పాము పిల్లల కలకలం

80 Baby Snakes Hatch in Markapur

  • మార్కాపురం పట్టణ శివారులో 15 రోజుల క్రితం గుడ్లు పెట్టిన పాములు
  • స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చిన స్థానికులు
  • 120 గుడ్లను సేకరించి అటవీశాఖ కార్యాలయంలో భద్రపరిచిన స్నేక్ క్యాచర్
  • వాటిలో నుంచి బయటకొచ్చిన 80 పాము పిల్లలు

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురంలో 80 పాము పిల్లలు బయటపడటం స్థానికంగా కలకలం రేపింది. మార్కాపురం పట్టణ శివారులో సుమారు 15 రోజుల క్రితం రెండు పాములు గుడ్లు పెట్టాయి. ఈ విషయాన్ని స్థానికులు స్నేక్ క్యాచర్ నిరంజన్‌కు తెలియజేశారు.

వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ నిరంజన్ 120 పాము గుడ్లను సేకరించి అటవీశాఖ కార్యాలయంలో భద్రపరిచారు. రెండు పాములకు చెందిన ఆ గుడ్లను వేర్వేరు డబ్బాల్లో ఇసుకలో ఉంచి పొదిగించినట్లు ఆయన తెలిపారు. వాటిలో నుంచి 80 పాము పిల్లలు బయటకు వచ్చినట్లు ఆయన వెల్లడించారు.

Niranjan
Markapur Snake Hatching
Andhra Pradesh Snakes
Snake Eggs
Snake Catcher
Wildlife
Reptiles
Markapuram
Snake incident
  • Loading...

More Telugu News