Nidhi Agerwal: ఆ సినిమా సమయంలో ఆ హీరోతో డేటింగ్ చేయొద్దని కండిషన్ పెట్టారు... నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్!

- బాలీవుడ్ డెబ్యూ మూవీ సమయంలో తనకు ఎదురైన వింత అనుభవాన్ని తెలిపిన హీరోయిన్
- టైగర్ ష్రాఫ్‌తో 'మున్నా మైకేల్' ద్వారా తెరంగేట్రం చేసిన నిధి అగర్వాల్
- ఆ సమయంలో తనతో మేకర్స్ 'నో డేటింగ్' అనే కండిషన్ పై సంతకం చేయించినట్లు వెల్లడి
యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. తన బాలీవుడ్ డెబ్యూ 'మున్నా మైకేల్' అగ్రిమెంట్ సమయంలో తనకు ఎదురైన వింత షరతును ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు.
నిధి అగర్వాల్ మాట్లాడుతూ... "నా సినిమా కెరీర్ బాలీవుడ్ మూవీ 'మున్నా మైకేల్'తో ప్రారంభమైంది. ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్ పక్కన హీరోయిన్‌గా నటించాను. ఈ సినిమాకు నేను ఓకే చెప్పిన తర్వాత మేకర్స్ నాతో ఒక అగ్రిమెంట్‌పై సంతకం చేయించుకున్నారు. అందులో ప్రాజెక్టుకు సంబంధించి నేను పాటించాల్సిన కొన్ని నిబంధనలతో పాటు 'నో డేటింగ్' అనే కండిషన్ కూడా ఉంది.
మూవీ చిత్రీకరణ దశలో ఉండగా.. నేను హీరోతో డేటింగ్ చేయకూడదనేది దాని అర్థం. అయితే, అప్పుడు నేను ఈ కండిషన్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ, తర్వాత నాకు అసలు విషయం తెలిసి షాక్ అయ్యాను. సినిమా షూటింగ్ దశలో ఉండగా హీరోహీరోయిన్ ప్రేమలో పడితే మూవీపై దృష్టిపెట్టకుండా ఉంటారని వారు అలా నాతో సంతకం చేయించుకున్నారు. అది తెలిసిన తర్వాత ఇలాంటి షరతు కూడా పెడతారా? అని అనిపించింది" అంటూ నిధి చెప్పుకొచ్చారు.
కాగా, ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో పవన్ కల్యాణ్, ప్రభాస్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. పవన్‌తో 'హరిహర వీరమల్లు'లో జత కడితే, ప్రభాస్ పక్కన 'రాజాసాబ్'లో చేస్తున్నారు. ఇక పూరి జగన్నాథ్, రామ్ కాంబోలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంలో హీరోయిన్‌గా నటించడం ద్వారా నిధి అగర్వాల్‌కు మంచి క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వరుసగా పెద్ద సినిమాల్లో అవకాశాలు దక్కాయి.