Shah Rukh Khan: ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌కు ముందు.. కేకేఆర్ జట్టుకు షారుఖ్ కీల‌క సందేశం.. ఇదిగో వీడియో!

Shah Rukh Khans Inspiring Message to KKR Before IPL Opener

 


మరికొన్ని గంట‌ల్లో ఐపీఎల్ 18వ సీజ‌న్‌ తొలి మ్యాచ్ ఆడ‌నున్న డిఫెండింగ్ ఛాంపియ‌న్ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌)కు ఆ జ‌ట్టు య‌జ‌మాని షారుఖ్ ఖాన్ డ్రెస్సింగ్ రూమ్‌లో ప్ర‌త్యేక సందేశాన్ని ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

"మీ అందరిపై దేవుడి క‌రుణ ఉండాలి. ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి. మిమ్మ‌ల్ని చ‌క్క‌గా చూసుకుంటున్న చంద్ర‌కాంత్ గారికి బిగ్‌ థ్యాంక్స్. కొత్త‌గా జ‌ట్టులో చేరిన వారికి స్వాగ‌తం. ఈ సీజ‌న్‌లో మ‌న‌ల్ని న‌డిపించ‌నున్న కెప్టెన్ అజింక్య ర‌హానెకు ధ‌న్య‌వాదాలు. మీ అంద‌రికీ ఈ టీమ్ ఇల్లులా మారుతుంద‌ని ఆశిస్తున్నా" అని షారుఖ్ అన్నారు. కాగా, ఈ రోజు రాత్రి 7.30 గంట‌ల‌కు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ)తో కేకేఆర్ త‌ల‌ప‌డ‌నున్న విష‌యం తెలిసిందే.   

More Telugu News