Sridevi: బాలీవుడ్ అంత వీజీ కాదని తేల్చేసిన భామలు!

 Star Heroines Special

  • సౌత్ లో స్టార్స్ అనిపించుకున్న హీరోయిన్స్ 
  • నార్త్ లోను గట్టి ప్రయత్నాలు చేసిన బ్యూటీస్ 
  • నంబర్ల వరకూ వెళ్లలేకపోయిన తీరు 
  • అదే దారిలో ఆ తరువాత వరుసలో ఉన్న భామలు   
  
బాలీవుడ్ కి శ్రీదేవి వెళ్లేవరకూ ఒక లెక్క .. వెళ్లిన తరువాత ఒక లెక్క అనే చెప్పుకోవాలి. సౌత్ ను ఒక రేంజ్ లో ఊపేసిన శ్రీదేవి ఆ తరువాత నార్త్ కి వెళ్లి, ఒక రేంజ్ లో సందడి చేసింది. శ్రీదేవి ఫీల్డ్ లో ఉన్నంత కాలం ఆమెను గురించి మాత్రమే మాట్లాడుకునేవారని అనడంలో అతిశయోక్తి లేదు. మాధురీ దీక్షిత్ .. ఐశ్వర్యారాయ్ లాంటి వారు వచ్చినా, శ్రీదేవిని మరిచిపోయేలా చేయలేకపోయారు. శ్రీదేవి తరువాత ఇక్కడి నుంచి వెళ్లి, అక్కడి వారిని ప్రభావితం చేసింది జయప్రద మాత్రమేనని చెప్పాలి.ఆ తరువాత కాలంలో హీరోయిన్స్ ఒకేసారి వివిధ భాషలో నటించడం మరింత ఎక్కువైపోయింది. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. ఇలా ఎక్కడి నుంచి అవకాశం వచ్చినా వదలకుండా హీరోయిన్స్ సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఇక సౌత్ లో మంచి క్రేజ్ ఉంది గనుక, తాము ఉత్తరాదికి వెళ్లడానికి ఇదే కరెక్టు టైమ్ అన్నట్టుగా ఆ దిశగా ఓ అడుగువేశారు. అక్కడ పరిచయాలు పెంచుకుని పరిగెత్తడానికి ట్రై చేశారు. అలాంటి కథానాయికల జాబితాలో తమన్నా .. కాజల్ .. ఇలియానా .. శ్రుతి హాసన్ వంటి వారు ఉన్నారు. వీళ్లంతా కూడా తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ స్టేటస్ ను అందుకున్నవారే. బాలీవుడ్ లో తమ హవాను కొనసాగించాలని భావించినవారే. అందరూ కూడా అడపాదడపా బాలీవుడ్ తెరపై అందంగా మెరిశారే తప్ప, చెప్పుకోదగిన స్థాయిలో తమదైన ముద్రను మాత్రం వేయలేకపోయారు. ఆలస్యంగానైనా అక్కడి వాతావరణాన్ని అర్థం చేసుకున్నారు. ఇక ఇప్పుడు అక్కడ పట్టు చిక్కించుకోవడానికి రష్మిక .. కీర్తి సురేశ్ ..గట్టిగానే ట్రై చేస్తున్నారు. సీనియర్ హీరోయిన్లను ఒక మాట అడిగితే, అదంతా వీజీ కాదని ఈ పాటికే చెప్పేవారేమో.

  • Loading...

More Telugu News