- బాలనటిగా పరిచయమైన ఇవాన
- 'లవ్ టుడే'తో పెరిగిన క్రేజ్
- 'డ్రాగన్' సినిమాలోను మెరిసిన బ్యూటీ
- త్వరలో తెలుగు సినిమాలు చేసే ఛాన్స్
వెండితెరపై బాలనటిగా మంచిపేరు సంపాదించుకున్నవారిలో చాలా తక్కువ మంది హీరోయిన్స్ గా వెలిగారు. అలాంటివారిలో శ్రీదేవి .. మీనా .. రాశి లాంటి వారు కనిపిస్తారు. అలా బాలనటిగా కొన్ని సినిమాలు చేసి, ఇప్పుడు అందాల కథానాయికగా తన హవాను కొనసాగిస్తోంది ఇవాన. ఆకర్షనీయమైన కళ్లతో ఈ అమ్మాయి చేసే చూపుల గారడీకి యూత్ అంతా కూడా ఫిదా అయిపోయింది. ముఖ్యంగా 'లవ్ టుడే' తరువాత ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయింది.

'లవ్ టుడే' సినిమా తెలుగులోనూ మంచి వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ బ్యూటీ ఇక్కడ కూడా బిజీ అవుతుందని అంతా భావించారు. దిల్ రాజు బ్యానర్ లో ఛాన్స్ కొట్టేసింది .. కానీ ఎక్కడో తేడా కొట్టేసింది. అందువలన తెలుగు ప్రేక్షకుల నుంచి మరిన్ని మార్కులు కొట్టేసే ఛాన్స్ కోసం ఆమె వెయిట్ చేస్తోంది. యంగ్ హీరోలు .. నితిన్ .. రామ్ వంటి స్టార్ హీరోలతో జోడీకొట్టే ఛాన్స్ కోసం గట్టిగానే ట్రై చేస్తుందనే టాక్ వినిపిస్తోంది.

సాధారణంగా ఇలా తమిళ ఇండస్ట్రీకి వచ్చిన వారు, పెద్దగా గ్యాప్ లేకుండానే తెలుగు సినిమా సెట్స్ పై కనిపిస్తూ ఉంటారు. కానీ ఇవాన విషయంలో అలా జరగలేదు. కుర్రాళ్లు ఈ అమ్మాయిని మరిచిపోయారేమో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇటీవల వచ్చిన 'డ్రాగన్' సినిమాలో తెరపై ఇవాన ఇలా మెరవగానే, కుర్రాళ్లంతా సందడి చేశారు. ఇక్కడ ఈ బ్యూటీకి ఎంతమాత్రం క్రేజ్ తగ్గలేదని అర్థమవుతుంది. చూడాలి మరి ఈ సుందరి ప్రయత్నాలు ఫలించి ఇక్కడ గట్టి పోటీ ఇస్తుందేమో .