Ram Charan: చరణ్ కి నచ్చని టైటిల్?

- షూటింగు దశలో చరణ్ 16వ సినిమా
- పరిశీలనలో 'పెద్ది' టైటిల్
- అసంతృప్తిని వ్యక్తం చేసిన చరణ్
- ఆలోచనలో పడిన టీమ్
- వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు
మెగా అభిమానులందరి దృష్టి ఇప్పుడు చరణ్ చేయనున్న 16వ సినిమాపై ఉంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాను. మైత్రీ - సుకుమార్ సంస్థలు సమర్పిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా మైసూర్ .. హైదరాబాదులలో కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది.
ఈ సినిమా కథ రాసుకునేటప్పుడే బుచ్చిబాబు 'పెద్ది' అనే టైటిల్ ను అనుకున్నాడు. ఈ టైటిల్ కి అభిమానుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ టైటిల్ విషయంలో చరణ్ అసంతృప్తిగా ఉన్నాడని అంటున్నారు. ఈ టైటిల్ పట్ల ఆయన అయిష్టతను వ్యక్తం చేశాడనే ప్రచారం బలంగానే జరుగుతోంది. దాంతో టైటిల్ పై టీమ్ గట్టిగానే కసరత్తు చేస్తున్నట్టుగా టాక్.
