IPL 2025: ఐపీఎల్ 2025... గూగుల్ డూడుల్ చూశారా?

మరికొన్ని గంటల్లో అతిపెద్ద ఫ్రాంచైజ్ క్రికెట్ మహా సంగ్రామం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది. డూడుల్‌ను క్రికెట్ పిచ్‌గా మార్చేసి, రెండు డక్స్ ఆడుతున్నట్లు చూపించింది.
ఈ డూడుల్‌లో బ్యాటర్ బంతిని కొడుతున్న దృశ్యం కనిపిస్తుంది. షాట్ ఆడిన వెంటనే, అంపైర్ తన చేతిని పైకెత్తి నాలుగు పరుగులు ఇవ్వడం చూపించింది. ఇక డూడుల్‌పై క్లిక్ చేయగానే మ్యాచ్ షెడ్యూల్‌లు, జట్టు లైనప్‌లు, సమయాలతో సహా అన్ని ఐపీఎల్ వివరాలు తెలుస్తాయి.
ఇదిలాఉంటే... ఈరోజు నుంచి ప్రారంభమవుతున్న ఐపీఎల్ 18వ సీజన్ రెండు నెలలకు పైగా అభిమానులను అలరించనుంది. మే 25న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఇవాళ ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తలపడనుంది.