Twitter Iconic Bird Logo: ట్విట్ట‌ర్ ఐకానిక్ బ‌ర్డ్ లోగోకు వేలంలో భారీ ధ‌ర‌..!

Twitters Iconic Bird Logo Sells for a Whopping 35000

  • గ‌తంలో ఉన్న బ్లూబ‌ర్డ్ లోగోను 'ఎక్స్‌'తో రీ బ్రాండ్ చేసిన మ‌స్క్‌
  • ఈ ఐకానిక్ బ‌ర్డ్ లోగోకు తాజాగా వేలం నిర్వ‌హించిన‌ 'ఆర్ఆర్ ఆక్ష‌న్‌' సంస్థ
  • ఏకంగా రూ.30 ల‌క్ష‌లకు అమ్ముడైన ట్విట్ట‌ర్ ఐకానిక్ లోగో

2022 అక్టోబ‌ర్‌లో టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ, ప్ర‌పంచ‌కుబేరుడు ఎలాన్ మ‌స్క్ ప్ర‌ముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్ట‌ర్ (ప్ర‌స్తుతం ఎక్స్‌)ను కొనుగోలు చేసిన‌ త‌ర్వాత సంస్థ‌లో చాలా మార్పులు చేసిన విష‌యం తెలిసిందే. వీటిలో ప్ర‌ధాన‌మైన‌ది సంస్థ లోగో. గ‌తంలో ఉన్న బ్లూబ‌ర్డ్ లోగోను ఎక్స్‌తో రీ బ్రాండ్ చేశారు. 

అయితే, ఈ ఐకానిక్ బ‌ర్డ్ లోగోకు తాజాగా 'ఆర్ఆర్ ఆక్ష‌న్‌' సంస్థ నిర్వ‌హించిన‌ వేలంలో భారీ ధ‌ర ప‌లికింది. ఏకంగా 35వేల డాల‌ర్లకు (రూ.30 ల‌క్ష‌లు) అమ్ముడైంది. 12 అడుగుల పొడ‌వు, 9 అడుగుల వెడ‌ల్పు, 254 కిలోల బ్లూబ‌ర్డ్ లోగోను ఈ భారీ ధ‌ర‌కు విక్ర‌యించిన‌ట్లు ఆర్ఆర్ ఆక్ష‌న్ వెల్ల‌డించింది. అయితే, ఈ లోగోను ద‌క్కించుకున్న వ్యక్తి అభ్య‌ర్థ‌న మేర‌కు అత‌ని వివ‌రాల‌ను వేలం సంస్థ బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌లేదు.   

  • Loading...

More Telugu News