Nayanthara: ముగ్గురి జీవితాలను మార్చేసే 'టెస్ట్' మ్యాచ్ .. నెట్ ఫ్లిక్స్ లో!

- తమిళంలో నిర్మితమైన 'టెస్ట్'
- క్రికెట్ నేపథ్యంలో నడిచే కథ
- ప్రధాన పాత్రల్లో నయన్ .. మాధవన్ .. సిద్ధార్థ్
- ఏప్రిల్ 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్
ఈ మధ్యనే ఉత్తరాదివారికి పరిచయమైన నయనతారకి, దక్షిణాదిన ఉన్న క్రేజ్ ను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. నయనతార ఒక సినిమాను ఒప్పుకుంది అంటేనే ఆ సినిమాలో విభిన్నమైన అంశం ఏదో ఉంటుందనే ఒక బలమైన నమ్మకం ఆడియన్స్ కి ఉంది. ఇక మాధవన్ .. సిద్ధార్థ్ కూడా ఎవరి దోవలో వారు ముందుకు వెళుతూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురూ కలిసి ఒక సినిమాను చేశారు .. ఆ సినిమా పేరే 'టెస్ట్'. చక్రవర్తి రామచంద్ర నిర్మించిన ఈ సినిమాకి, శశికాంత్ దర్శకత్వం వహించాడు. మీరా జాస్మిన్ .. కాళీ వెంకట్ .. నాజర్ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల వలన కుదరకపోవడంతో, ఏప్రిల్ 4వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ చేయనున్నారు.
"ఇది స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగే కథ. సాధారణంగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగే కథల్లో ఆట వైపు నుంచి ఎక్కువ కథ ఫోకస్ లో ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ఈ కథ నడుస్తుంది. చెన్నైలో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులపై ఆ 'టెస్ట్' ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అది వాళ్ల జీవితాలను ఎలా అతలాకుతలం చేస్తుంది? అనేది కథ.