child prodigy: అలవోకగా సిక్స్ లు బాదేస్తున్న ఆరేళ్ల చిన్నారి.. వీడియో ఇదిగో!

6 Year Old Pakistani Girls Stunning Sixes Viral

  • పాకిస్థానీ బాలికను రోహిత్ శర్మ బ్యాటింగ్ తో పోల్చుతున్న నెటిజన్లు
  • రోహిత్ శర్మను తలపించేలా ఫుల్ షాట్ కొడుతున్న బాలిక
  • పాకిస్థాన్ జట్టులో ఆడించాలంటూ నెటిజన్ల కామెంట్లు

పాకిస్థాన్ కు చెందిన ఆరేళ్ల బాలికను నెటిజన్లు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మతో పోలుస్తున్నారు. ఇంట్లో తండ్రి బౌలింగ్ చేస్తుంటే అలవోకగా షాట్లు కొడుతున్న బాలిక శైలికి ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా ఏకంగా పది లక్షల మంది చూశారు. పాకిస్థాన్ ఫ్యూచర్ స్టార్ అని, పురుషుల జట్టులో ఆడించాలని కామెంట్లు పెడుతున్నారు.

ఫుల్ షాట్ ఆడడంలో రోహిత్ శర్మకు ప్రత్యేక శైలి ఉంది. అచ్చంగా ఈ శైలిని అనుకరిస్తూ పాకిస్థానీ బాలిక సోనియా ఖాన్ క్రికెట్ ప్రియులను ఆకట్టుకుంటోంది. సోనియా ప్రతిభను చూసి ముచ్చటపడ్డ ఇంగ్లిష్ క్రికెట్ అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆరేళ్ల వయసులోనే పూర్తి ప్రొఫెషనల్ క్రికెటర్ గా షాట్ లు కొట్టడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. కాగా, ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శనను ఎత్తిచూపుతూ.. పాకిస్థాన్ జట్టులో ఈ అమ్మాయిని ఆడిస్తే బాగుంటుందని ఎద్దేవా చేస్తున్నారు.

ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు న్యూజిలాండ్ లో పర్యటిస్తోంది. ఈ పర్యటనకు సోనియా ఖాన్ ను కూడా పంపించాలని ఫన్నీగా డిమాండ్ చేస్తున్నారు. మరికొంతమంది నెటిజన్లు మరో అడుగు ముందుకేసి.. పాకిస్థాన్ జట్టులో రిజ్వాన్, బాబర్ కన్నా ఈ అమ్మాయే బాగా ఆడుతోందని కామెంట్లు పెట్టారు. పాక్ జట్టుకు ఈ బాలికతో కోచింగ్ ఇప్పించాలని మరో నెటిజన్ సలహా ఇచ్చారు.

More Telugu News