Virat Kohli: లిటిల్ ఫ్యాన్‌కు లైఫ్ టైమ్ మెమరీ ఇచ్చిన విరాట్ కోహ్లీ.. ఇదిగో వీడియో!

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రన్ మెషీన్‌కు వయసుతో సంబంధం లేకుండా అభిమానులు ఉంటారు. ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నా, మ్యాచ్‌లు ఆడినా ఇలా ఎక్కడైనా ఫ్యాన్స్ అతని కోసం పోటెత్తుతారు. తాజాగా కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనగా అక్కడికి ఓ లిటిల్ ఫ్యాన్ వచ్చాడు.
'కోహ్లీ భయ్యా ఆటోగ్రాఫ్' అని అరుస్తూ విరాట్‌ను అనుసరించాడు. కొన్ని గంటల నిరీక్షణ తర్వాత ఆ బుడ్డోడిని కోహ్లీ గుర్తించాడు. ప్రాక్టీస్ ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో బస్‌లో కూర్చున్న రన్ మెషీన్... ఆ బుడ్డోడు ఇచ్చిన ఫొటోపై ఆటోగ్రాఫ్ చేసిచ్చాడు. ఇలా ఆ లిటిల్ ఫ్యాన్‌కు కోహ్లీ లైఫ్ టైమ్ మెమరీని అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ తమదైనశైలిలో స్పందిస్తున్నారు.