APSRTC: ఏపీలో ఆర్టీసీ సీనియర్‌లకు షాక్‌ ఇచ్చిన డీపీసీ

110 APSRTC Promotions Halted Due to Incomplete Reports

  • ఆర్టీసీలో ప్రమోషన్ల ప్రక్రియకు బ్రేక్ 
  • సరైన వివరాలు అందజేయకపోవడంతో ప్రమోషన్ల ప్రక్రియకు నిరాకరించిన డీపీసీ
  • ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వంద మందికిపైగా సీనియర్ అధికారులు

ఏపీఎస్ ఆర్టీసీలో పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న సీనియర్ అధికారులకు నిరాశ ఎదురైంది. శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ - డీపీసీ) వారి ఆశలకు గండి కొట్టింది. డీపీసీకి సరైన వివరాలు అందజేయకపోవడంతో దాదాపు 110 మంది అధికారుల పదోన్నతులకు బ్రేక్ పడింది.

ఆర్టీసీలో డిపో మేనేజర్, డివిజనల్ మేనేజర్, రీజనల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) కేడర్లలోని పలువురు అధికారులు గత ఆరు నెలలుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పదోన్నతుల ఎంపిక కోసం డీపీసీ సమావేశం జరిగింది. అయితే, ఆయా అధికారులకు సంబంధించిన వార్షిక రహస్య నివేదికలు (యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్) ప్రభుత్వ ఫార్మాట్‌లో సిద్ధం చేయనందున ఎంపిక ప్రక్రియను నిర్వహించడానికి డీపీసీ నిరాకరించింది.

ప్రస్తుతం ఉన్న నివేదికలను పరిగణనలోకి తీసుకొని పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని ఆర్టీసీ అధికారులు విజ్ఞప్తి చేసినప్పటికీ, డీపీసీ అంగీకరించలేదు. ప్రభుత్వ ఫార్మాట్‌లోనే నివేదికలు సమర్పించాలని డీపీసీ స్పష్టం చేసింది. పదోన్నతుల ప్రక్రియ ఆలస్యం అవుతున్న కారణంగా అనేక జిల్లాల్లో డిపోలకు ఇన్ఛార్జి అధికారులతోనే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 

  • Loading...

More Telugu News