Sheik Sajila: గుంటూరు కార్పొరేషన్ తాత్కాలిక మేయర్‌గా షేక్ సజీలా

Sheik Sajila Appointed as Interim Mayor of Guntur

  • ఇటీవల మేయర్ పదవికి రాజీనామా చేసిన మనోహర్ నాయుడు
  • కొత్త మేయర్‌ను ఎన్నుకునే వరకు సజీలాకు తాత్కాలిక మేయర్ బాధ్యతలు
  • 2024 ఎన్నికలకు ముందు తండ్రితో కలిసి టీడీపీలో చేరిన సజీలా

గుంటూరు కార్పొరేషన్ తాత్కాలిక మేయర్‌గా షేక్ సజీలా బాధ్యతలు స్వీకరించారు. ఆరు రోజుల క్రితం మేయర్ పదవికి కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేయడంతో, కొత్త మేయర్‌ను ఎన్నుకునే వరకు డిప్యూటీ మేయర్ సజీలాకు తాత్కాలిక మేయర్ బాధ్యతలను అప్పగించారు.

సజీలా తండ్రి షేక్ షౌకత్ సుదీర్ఘ కాలం తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. 2019 ఎన్నికల సమయంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2021 మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా తరఫున సజీలా కార్పొరేటర్‌గా గెలుపొందారు. అనంతరం ఆమెను డిప్యూటీ మేయర్‌గా నియమించారు. 2024 ఎన్నికలకు ముందు తండ్రి షౌకత్, కూతురు సజీలా తెలుగుదేశం పార్టీలో చేరారు.

Sheik Sajila
Guntur Municipal Corporation
Interim Mayor
Deputy Mayor
Kavati Manohar Naidu
TDP
YSRCP
Municipal Elections
Andhra Pradesh Politics
  • Loading...

More Telugu News