Pawan Kalyan: పవన్ రాష్ట్రానికి, దేశానికి ఏం చేస్తాడని చూడాలి కానీ... సినిమా తీయాలని కోరుకోకూడదు: నాగవంశీ

- ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్
- ప్రభుత్వ కార్యక్రమాలతో ఫుల్ బిజీ
- ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు
టాలీవుడ్ హీరోగా ప్రజల్లో అభిమానం సంపాదించిన పవన్ కల్యాణ్, రాజకీయాల్లోకి వచ్చి ఇటీవల విజయం సాధించి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఒకవైపు సినిమా షూటింగులు, మరోవైపు రాజకీయాలతో ఆయన గతంలో బిజీగా ఉండేవారు. ప్రస్తుతం జనసేన అధికారంలోకి రావడంతో ప్రభుత్వ కార్యక్రమాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు.
అయితే, ఆయన గతంలో అంగీకరించిన సినిమాల భవితవ్యంపై అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ పవన్ కల్యాణ్ సినీ కెరీర్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించిన 'మ్యాడ్ స్క్వేర్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన మాట్లాడారు.
పవన్ కల్యాణ్ ఈ రాష్ట్రానికి, దేశానికి ఏం చేస్తాడనేది కోరుకోవాలని, ఆయన సినిమా చేయాలని కోరుకోకూడదని నాగవంశీ అన్నారు. పవన్ మరింత ఉన్నత స్థాయికి చేరుకుని రాష్ట్రానికి, దేశానికి మంచి చేయాలని ఆకాంక్షించాలని అభిప్రాయపడ్డారు. నాగవంశీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. పవన్ కల్యాణ్ ఇకపై సినిమాలకు స్వస్తి పలుకుతారా అనే ఆలోచనలు మొదలయ్యాయి.
పవన్ చేతిలో ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నాయి. హరిహర వీరమల్లు ఈ వేసవిలో మే 9న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, ఓజీ చిత్రీకరణ 80 శాతం పూర్తయింది. ఉస్తాద్ భగత్ సింగ్ కొద్దిమేర షూటింగ్ జరుపుకుంది