Chandrababu Naidu: ఒక వడను చెరిసగం పంచుకుని తిన్న నారా భువనేశ్వరి, చంద్రబాబు... నెటిజన్ల స్పందన మామూలుగా లేదు!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం ఇవాళ తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకుంది. నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు, నారా భువనేశ్వరి, నారా లోకేశ్, బ్రాహ్మణి తిరుమలలోని అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. అనంతరం వారు అన్న ప్రసాద కేంద్రంలోనే అల్పాహారం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
పక్కపక్కనే కూర్చున్న చంద్రబాబు దంపతులు ఒక వడను చెరిసగం పంచుకుని తినడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక వడను తీసుకున్న భువనేశ్వరి సగానికి విరిచి ఒక సగం తాను తీసుకుని, మరో సగం చంద్రబాబుకు ఇచ్చారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
జీవితం చెరో సగం... ప్రమాణమేగా అనే సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తుండగా... పలు వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. భార్యాభర్తలు ఎలా ఉండాలనేదానికి చంద్రబాబు, భువనేశ్వరి ఉదాహరణగా నిలిచారని నెటిజన్లు కొనియాడుతున్నారు.