Nitish Kumar: వివాదంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్.. రాజీనామా చేయాలని తేజస్వీ యాదవ్ డిమాండ్!

బీహార్ సీఎం నితీశ్ కుమార్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన అక్కడ వ్యవహరించిన తీరు వివాదానికి దారి తీసింది. పట్నాలో ఓ క్రీడా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జాతీయ గీతం ప్లే అవుతుండగా నవ్వుతూ పక్కన ఉన్న వారిని పలకరించారు.
ఈ వీడియోను విపక్ష నేత తేజస్వీ యాదవ్ పోస్ట్ చేస్తూ సీఎం హోదాలో ఉండి ఇలా ప్రవర్తించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానసికంగా, శారీరకంగా ఆయన ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాదన్నారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.