Gaddam Prasad: రోడ్లు లేక మా జిల్లాలో పిల్ల‌నిచ్చే ప‌రిస్థితి లేదు: స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్‌

Speaker Gaddam Prasads Witty Remark on Telangana Roads

  • తెలంగాణ శాస‌న‌స‌భ‌లో బ‌డ్జెట్‌పై చ‌ర్చ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌
  • రోడ్ల నిర్మాణం అశంపై మంత్రి కోమ‌టిరెడ్డి, హ‌రీశ్‌రావు మ‌ధ్య డైలాగ్ వార్
  • బీఆర్ఎస్ హ‌యాంలో రాష్ట్ర‌మంత‌టా రోడ్లు వేశామ‌న్న మాజీ మంత్రి
  • మా వికారాబాద్ జిల్లాలో రోడ్లు లేక అబ్బాయిల‌కు పిల్ల‌నిచ్చే ప‌రిస్థితి కూడా లేద‌న్న స్పీక‌ర్‌
  • స్పీక‌ర్ గడ్డం ప్ర‌సాద్ కౌంట‌ర్‌కు స‌భ‌లో కొద్దిసేపు న‌వ్వులు

తెలంగాణ శాస‌న‌స‌భ‌లో బ‌డ్జెట్‌పై చ‌ర్చ సంద‌ర్భంగా స్పీక‌ర్ గ‌డ్డ ప్ర‌సాద్ కుమార్ చేసిన వ్యాఖ్య‌లు న‌వ్వులు పూయించాయి. రోడ్ల నిర్మాణం అంశంపై మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత హ‌రీశ్‌రావు మ‌ధ్య గ‌ట్టి చ‌ర్చ జ‌రిగింది. ఈ క్ర‌మంలో త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో రాష్ట్ర‌వ్యాప్తంగా రోడ్లు వేశామ‌ని హ‌రీశ్‌రావు అన్నారు.

దాంతో మ‌ధ్య‌లో క‌లుగ‌జేసుకున్న స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్‌... మా వికారాబాద్ జిల్లాలో రోడ్లు లేక అబ్బాయిల‌కు పిల్ల‌నిచ్చే ప‌రిస్థితి కూడా లేద‌న్నారు. అంతే... స్పీక‌ర్ కౌంట‌ర్‌కు స‌భ‌లోని స‌భ్య‌లంద‌రూ ఒక్క‌సారిగా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వేశారు. కాంగ్రెస్ స‌భ్యులు షేమ్ షేమ్ అంటూ నినాదాలు చేయ‌గా... పాత మండ‌లాల ప్ర‌కారం అన్ని మండ‌లాల్లో రోడ్లు వేశామ‌ని హ‌రీశ్‌రావు వివ‌రించారు. 


  • Loading...

More Telugu News