Keerthy Suresh: కీర్తి సురేశ్ ను ఆటపట్టించిన ఐస్ క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటర్ ఇచ్చిన నటి

పలు చోట్ల ఐస్ క్రీమ్ దుకాణాల్లో వెండర్లు ఐస్ క్రీమ్ ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుంటూ, ఐస్ క్రీమ్ స్టిక్ ను అటూ ఇటూ తిప్పుతూ... ఎంతకీ ఐస్ క్రీమ్ ఇవ్వకుండా ఆటపట్టిస్తుంటారు. ప్రముఖ నటి కీర్తి సురేశ్ కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. అయితే ఆమె ఫన్నీగా కౌంటర్ ఇచ్చారు.
ఓ ఐస్ క్రీమ్ దుకాణానికి వెళ్లిన కీర్తి సురేశ్ ను... ఐస్ క్రీమ్ వెండర్ ఆటపట్టించాడు. చివరికి ఎలాగో ఐస్ క్రీమ్ ఇచ్చాడు. అయితే, కీర్తి సురేశ్ కూడా డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి, అటూ ఇటూ తిప్పుతూ సదరు ఐస్ క్రీమ్ వెండర్ ను ఆటపట్టించింది. చివరికి ఓ వెండర్ చటుక్కున చేయిపట్టేసుకోవడంతో, కీర్తి సురేశ్ డబ్బులు ఇచ్చేసి అక్కడ్నించి చిరునవ్వుతో వచ్చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.