NMD Farooq: ఏపీ మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ ఇంట్లో తీవ్ర విషాదం

AP Minister NMD Farooqs Wife Passes Away

  • మంత్రి ఫరూఖ్ భార్య షహనాజ్ కన్నుమూత
  • తీవ్ర అనారోగ్యంతో మృతి 
  • రేపు నంద్యాలలో అంత్యక్రియలు

ఏపీ మైనారిటీ  శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ భార్య షహనాజ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. షహనాజ్ కొంతకాలంగా హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె తిరిగి కోలుకోలేకపోయారు. ఆమె భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి నంద్యాల తరలిస్తున్నారు. శనివారం నాడు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News