Pawan Kalyan: పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' డబ్బింగ్ పనులు ప్రారంభం

Pawan Kalyans Hari Hara Veera Mallu Dubbing Begins

  • పవన్ ప్రధాన పాత్రలో హరిహర వీరమల్లు
  • క్రిష్ / జ్యోతికృష్ణ డైరెక్షన్ లో చిత్రం
  • మే 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో క్రిష్/జ్యోతికృష్ణ డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం హరిహర వీరమల్లు... స్వోర్డ్ ఆఫ్ స్పిరిట్ అనేది ట్యాగ్ లైన్. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఎం రత్నం సమర్పణలో వస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

తాజాగా ఈ చిత్రం డబ్బింగ్ పనులు ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు. అసమాన హీరోయిజంను తెరపై చూసేందుకు కొన్నిరోజుల సమయం మాత్రమే ఉంది అంటూ పేర్కొన్నారు.

ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

  • Loading...

More Telugu News