Yuzvendra Chahal: చాహ‌ల్‌-ధ‌న‌శ్రీ విడాకులు... బ‌యట‌కు వచ్చిన షాకింగ్ నిజం!

Chahal Dhanshree Divorce Shocking Truth Revealed

  • నిన్న చాహ‌ల్‌-ధ‌న‌శ్రీకి విడాకులు మంజూరు చేసిన ముంబ‌యి ఫ్యామిలీ కోర్టు
  • చాహ‌ల్‌, ధ‌న‌శ్రీకి 2020 డిసెంబ‌ర్‌లో పెళ్ల‌వ‌గా.. 2022 జూన్ నుంచే స‌ప‌రేట్
  • తాము దాఖ‌లు చేసిన విడాకుల పిటిష‌న్‌లో షాకింగ్ విష‌యాన్ని పేర్కొన్న జంట‌

టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధ‌న‌శ్రీ వ‌ర్మ‌ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్న విష‌యం తెలిసిందే. గురువారం నాడు ముంబ‌యిలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు ఈ జంట‌కు విడాకులు మంజూరు చేసింది. 

"పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ చాహల్, ధ‌న‌శ్రీ దాఖలు చేసిన ఉమ్మడి పిటిషన్‌ను కుటుంబ కోర్టు అంగీకరించింది" అని చాహల్ తరపు న్యాయవాది నితిన్ గుప్తా అన్నారు. ఇక‌పై వారిద్ద‌రు భార్యాభ‌ర్త‌లు కాద‌ని గుప్తా మీడియాతో తెలిపారు. 

అయితే, ఈ జంట దాఖ‌లు చేసిన విడాకుల పిటిష‌న్‌లో ఓ షాకింగ్ విష‌యం బ‌ట‌య‌కు వ‌చ్చింది. చాహ‌ల్‌, ధ‌న‌శ్రీకి 2020 డిసెంబ‌ర్‌లో పెళ్ల‌వ‌గా, 2022 జూన్ (ఏడాదిన్న‌ర‌కే) నుంచే స‌ప‌రేట్ అయిన‌ట్లు విడాకుల పిటిష‌న్‌లో పేర్కొన్నారు. 

కాగా, ధ‌న‌శ్రీకి చాహల్ భ‌ర‌ణం కింద‌ రూ. 4.75 కోట్లు చెల్లించేందుకు అంగీక‌రించిన‌ట్లు న్యాయ‌స్థానం పేర్కొంది. ఇందులో భాగంగా అత‌ను రూ.2.37 కోట్లు చెల్లించాడని కుటుంబ కోర్టు తెలిపింది. 

  • Loading...

More Telugu News