Bill Gates: సచిన్‌తో కలిసి వడాపావ్ తిన్న బిల్ గేట్స్.. ఇదిగో వీడియో!

భారత పర్యటనలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్
నిన్న భారత క్రికెట్ దిగ్గజం సచిన్‌తో భేటీ
ఈ సందర్భంగా వడాపావ్ తిన్న దిగ్గజాలు
ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన బిల్ గేట్స్
దేశ ఆర్థిక రాజధాని ముంబయి అనగానే వెంటనే అందరికీ గుర్తుకొచ్చే స్ట్రీట్ ఫుడ్ వడాపావ్. భారత పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గురువారం నాడు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరు కలిసి వడాపావ్ తిన్నారు.
దీనికి సంబంధించిన వీడియోను బిల్ గేట్స్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నారు. పనిలోకి వెళ్లబోయే ముందు చిన్న స్నాక్ బ్రేక్ అంటూ రాసుకొచ్చారు. అలాగే వీడియోకు సర్వింగ్ వెరీసూన్ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్ లైక్ చేయడం విశేషం. భారత పర్యటనలో ఉన్న గేట్స్ తాజాగా పార్లమెంటును సందర్శించిన విషయం తెలిసిందే. ఆయనతో ఏపీ సీఎం చంద్రబాబు కూడా భేటీ అయి, రాష్ట్రానికి సంబంధించి పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. కాగా, ప్రపంచకుబేరుడైన బిల్ గేట్స్... గత మూడేళ్లలో భారత్‌లో పర్యటించడం ఇది మూడోసారి.