Sansul Hoada: ఎమ్మెల్యేకి కోపం వచ్చింది... అరటి బోదెతో కొట్టాడు!

అసోంలో ఓ ఎమ్మెల్యే బ్రిడ్జి కాంట్రాక్టర్ వద్ద పనిచేసే ఉద్యోగిపై చేయి చేసుకున్నాడు. అతడిని అరటి బోదెతో బాదాడు. ఇంతకీ ఏం జరిగిందంటే... అసోంలోని బిలాసిపర (ఈస్ట్) నియోజకవర్గ ఎమ్మెల్యే సంసుల్ హుడా ఓ బ్రిడ్జి భూమిపూజ కార్యక్రమానికి వచ్చారు. అయితే, అక్కడ కత్తిరించడానికి రెడ్ రిబ్బన్ బదులు పింక్ రిబ్బన్ కట్టారు.
పింక్ రిబ్బన్ ఎందుకు కట్టారని, సదరు బ్రిడ్జి కాంట్రాక్టర్ వద్ద పనిచేసే ఉద్యోగులను ఎమ్మెల్యే ప్రశ్నించారు. రెడ్ రిబ్బన్ లేకపోవడంతో పింక్ రిబ్బన్ కట్టామని ఓ ఉద్యోగి బదులిచ్చాడు. దాంతో మండిపడిన ఎమ్మెల్యే సంసుల్ హుడా... ఆ ఉద్యోగి చొక్కా పట్టుకుని ముందుకు లాగి చెంప చెళ్లుమనిపించాడు. అంతేకాదు, అక్కడే తోరణాలు కట్టేందుకు తీసుకువచ్చిన అరటి బోదెను అందుకుని ఆ ఉద్యోగిపై దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.