Gautham: గౌతమ్ యాక్టింగ్‌కు మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.. ఇదిగో వీడియో!

- ఇప్పటికే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన గౌతమ్
- తండ్రి బాటలోనే నటనపై ఆసక్తి
- న్యూయార్క్‌లోని ప్రముఖ వర్సిటీలో నటనలో శిక్షణ
- ఇటీవల తోటి విద్యార్థితో కలిసి ఒక స్కిట్‌లో నటించిన గౌతమ్
- ఆ స్కిట్ తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ ఇప్పటికే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తండ్రి బాటలోనే నటనపై ఆసక్తితో ఉన్న గౌతమ్ గత కొంతకాలంగా అమెరికాలో ఉంటూ.. న్యూయార్క్‌లోని ప్రముఖ యూనివర్సిటీలో యాక్టింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగా తనలోని నటన నైపుణ్యాన్ని బయటపెడుతూ ఇటీవల అతడు ఒక స్కిట్‌లో నటించాడు.
తోటి విద్యార్థితో కలిసి గౌతమ్ చేసిన ఈ స్కిట్ తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ప్రారంభంలో చిరునవ్వుతో కూల్‌గా కనిపించిన అతడు... కొద్ది క్షణాల్లోనే ఆగ్రహావేశాలతో డైలాగ్ చెబుతూ కనిపించాడు. ఇక వీడియో చూసిన ఘట్టమనేని అభిమానులు గౌతమ్ నటనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భలే యాక్టింగ్ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మహేశ్ వారసుడి యాక్టింగ్‌పై ఓ లుక్కేయండి.