AP MLAs and MLCs Sports Meet: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్పోర్ట్స్ మీట్ విజేత‌లకు బ‌హుమ‌తుల ప్ర‌దానం

CM Chandrababu Naidu Presents Awards at Sports Meet

  • విజేత‌ల‌కు బ‌హుమ‌తులు అంద‌జేసిన సీఎం, డిప్యూటీ సీఎం, స్పీక‌ర్‌, డిప్యూటీ స్పీక‌ర్‌
  • క్రికెట్‌లో విజేత‌గా నిలిచిన నాదెండ్ల మ‌నోహ‌ర్ జట్టు
  • బ్యాడ్మింట‌న్ పురుషుల సింగిల్స్ విభాగంలో విన్న‌ర్‌ టీజీ భ‌ర‌త్‌
  • వాలీబాల్‌ విన్న‌ర్స్ అయ్య‌న్న పాత్రుడు జ‌ట్టు
  • టగ్ ఆఫ్ వార్‌ విజేత (మ‌హిళ‌లు) గుమ్మ‌డి సంధ్యారాణి జ‌ట్టు 

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా విజేత‌లుగా నిలిచిన వారికి విజ‌య‌వాడ‌లో గురువారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్, స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు, డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, మంత్రులు కందుల దుర్గేశ్‌, కేశ‌వ్‌లు బ‌హుమ‌తులు ప్ర‌దానం చేశారు. 

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో విజేత‌లు వీరే... 
క్రికెట్‌: విన్న‌ర్‌- నాదెండ్ల మ‌నోహ‌ర్ జట్టు, ర‌న్న‌ర‌ప్‌- స‌త్య‌కుమార్ జ‌ట్టు

బ్యాడ్మింట‌న్: పురుషుల సింగిల్స్ విభాగంలో విన్న‌ర్‌- టీజీ భ‌ర‌త్‌, ర‌న్న‌ర్- జ‌య‌నాగేశ్వ‌ర్‌రెడ్డి
మ‌హిళ‌ల సింగిల్స్ విభాగంలో విన్న‌ర్‌- పి. సింధూర రెడ్డి, ర‌న్న‌ర్‌- భూమా అఖిల‌ప్రియ
పురుషుల డ‌బుల్స్ విభాగంలో విన్న‌ర్స్‌- స‌త్య‌కుమార్ యాద‌వ్‌, జ‌య‌నాగేశ్వ‌ర్‌రెడ్డి, ర‌న్న‌ర్స్‌- టీజీ భ‌ర‌త్‌, వి. పార్థ‌సార‌థి
మ‌హిళ‌ల డ‌బుల్స్ విభాగంలో విన్న‌ర్స్- పి. సింధూర రెడ్డి, భూమా అఖిల‌ప్రియ, ర‌న్న‌ర్స్‌- శ్రావ‌ణి, స‌విత‌
మిక్స్‌డ్ డ‌బుల్స్ లో విన్న‌ర్స్‌- టీజీ భ‌ర‌త్‌, స‌విత‌, ర‌న్న‌ర్స్‌- భూమా అఖిల‌ప్రియ, జ‌య‌నాగేశ్వ‌ర్‌రెడ్డి

వాలీబాల్‌: విన్న‌ర్స్- అయ్య‌న్న పాత్రుడు జ‌ట్టు, ర‌న్న‌ర్- మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి 

క‌బ‌డ్డీ: ప్ర‌థ‌మ- సీఎం జ‌ట్టు, ద్వితీయ- స్పీక‌ర్ జ‌ట్టు, తృతీయ‌- బుచ్చ‌య్య చౌద‌రి జ‌ట్టు

టేబుల్ టెన్నిస్: ప్ర‌థ‌మ బ‌హుమ‌తి- వ‌ర్ల కుమార‌రాజ‌, ద్వితీయ‌- కేఈ శ్యామ్‌, తృతీయ‌- బి. విజ‌య‌చంద్ర‌

టెన్ని సింగిల్స్: పురుషుల విభాగంలో విన్న‌ర్‌- నాదెండ్ల మ‌నోహ‌ర్‌, ర‌న్న‌ర్- పీవీ పార్థ‌సార‌థి  

టగ్ ఆఫ్ వార్‌: విజేత (మ‌హిళ‌లు)- గుమ్మ‌డి సంధ్యారాణి జ‌ట్టు
విజేత (పురుషులు-1)- గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి జ‌ట్టు, విజేత (పురుషులు-2)- ర‌ఘురామ‌కృష్ణ‌రాజు జ‌ట్టు   

  • Loading...

More Telugu News